తమ్ముడు పవన్‌ను ఇమిటేట్ చేసిన చిరు..శాంపిలే అంటూ ట్వీట్
భోళాశంకర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
By Srikanth Gundamalla Published on 17 July 2023 11:15 AM ISTతమ్ముడు పవన్‌ను ఇమిటేట్ చేసిన చిరు..శాంపిలే అంటూ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల గురించి ట్విట్టర్ వేదికగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తోన్న తాజా చిత్రం 'భోళాశంకర్' నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చిరులీక్స్ పేరుతో గతకొన్నాళ్లుగా చిరంజీవి ఆయన సినిమాల గురించిన విషయాలు చెప్తున్నారు. అయితే.. భోళాశంకర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు చిరు. దీంట్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేశానని... అది అందినీ అలరిస్తుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా చిరంజీవి విడుదల చేశారు. దానికి వాయిస్ ఓవర్ చెప్తూ గతంలో పవన్ తనని ఇమిటేట్ చేశారని.. ఈసారి తమ్ముడిని తాను ఇమిటేట్ చేశానని అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూటీ అప్‌డేట్ గురించి చెబుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ ఈకోసం భోళాశంకర్ నుంచి చిన్న విషయాన్ని లీక్ చేస్తున్నా. ఈ విషయం తెలిస్తే మెహర్ రమేశ్ గొడవ చేసేస్తాడు. అయినా ఏ ఫరవాలేదు. విషయం ఏంటంటే' అని వీడియో మొదలు పెడతారు. 'కళ్యాణ్ బాబు తన చిత్రాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకొస్తూ, నా డ్యాన్స్ స్పెప్పులను ఇమిటేట్ చేస్తూ, నా డైలాగులను చెబుతూ ఎంతో ఎంటర్‌టైన్ చేశాడు. అలాగే నేను బోళాశంకర్ సినిమాలో తనని ఇమిటేట్ చేశాను. తన పాటకి స్టెప్పులు వేయడం జరిగింది. అవి తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి' అంటూ పవన్ 'ఖుషీ' సినిమాలోని యే మేరా జహా.. పాటలో పవన్ మేనరిజనాన్ని చిరంజీవి అనుకరించిన వీడియోను చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు.. హా... హా.. అంటూ అచ్చం పవన్‌లా అంటూ తమ్ముడి పాట ముస్తుందిలే అంటూ డైలాగ్ కూడా చెప్పారు. అయితే.. అప్పుడే అయిపోలేదు ఇంకా వుంది.. మొత్తం థియేటర్లలో చూడండి.. ఇది శాంపిల్ మాత్రమే అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. దయ చేసి ఎవరికీ చెప్పొద్దు.. మన మధ్యే ఉండాలంటూ చివరకు చెప్పిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి.
ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ సినిమా కావడంతో ఇప్పటికే భోళాశంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటించింది. కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటించింది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2023