టీఎన్ఆర్ కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు సాయం

Chiranjeevi Helps To TNR Family. టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.

By Medi Samrat  Published on  11 May 2021 9:17 PM IST
Chiranjeevi helps to TNR family
ప్రముఖ సినీ పాత్రికేయుడు టీఎన్ఆర్ మరణం ఎంతో మందిని కలచి వేస్తున్న సంగతి తెలిసిందే..! ఆయన కుటుంబాన్ని ఆదుకోడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చినట్లుగా టీఎన్ఆర్ పలు సందర్భాలలో చెప్పారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. లక్షరూపాయలను తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని చిరంజీవి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. టీఎన్ఆర్ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.


నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెదిగానని తెలిపారు. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూ మాటిచ్చారు. ఇతరులు కూడా టీఎన్ఆర్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు.


Next Story