శ్యామ్ సింగరాయ్‌తో మీసం మెలేసిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi heaps praise on Nani’s Shyam Singha Roy.ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్
By తోట వంశీ కుమార్
'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. నాని ద్విపాత్రాభినయంతో మెప్పించారు. బెంగాల్ నేపథ్యంలో వచ్చే కథ సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. మెగాస్టార్‌ను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు నాని ని ప్రత్యేకంగా తమ ఇంటికి ఆహ్వానించారు. నువ్వు దీని కంటే మరెన్నో ప్రశంసలకు అర్హుడివి అని చిరంజీవి చెప్పడంతో నాని కృతజ్ఞతలు తెలిపాడు. శ్యామ్‌సింగరాయ్ చిత్రం మెగాస్టార్ దంపతులకు ఎంతో నచ్చిందని.. వారితో గడిపిన రోజు అద్భుతంగా ముగిసిందంటూ చిరంజీవితో కలసి మీసం మెలేస్తూ తీసుకున్న సెల్ఫీని నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc
— Nani (@NameisNani) January 20, 2022
ఇక ఈ చిత్రం ఈరోజు(జనవరి 21) నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సత్తా చాటిన శ్యామ్ సింగరాయ్.. ఓటీటీలో అభిమానులను అలరిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటించారు.