ఉత్తేజ్‌ని పరామర్శించిన చిరంజీవి
Chiranjeevi condolences to Uttej.ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on
13 Sep 2021 7:30 AM GMT

ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆయన భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ, జీవిత తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఉత్తేజ్‌ను ఓదార్చారు.
చిరంజీవిని చూడగానే ఉత్తేజ్, కుమారై చేతన కన్నీటి పర్యంతం అయ్యారు. ఉత్తేజ్.. చిరంజీవి కాళ్లమీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో చిరంజీవి, ప్రకాశ్ రాజ్‌లు సైతం భావోద్వేగానికి లోనైయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కుమారై చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. పద్మావతి.. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు.
Next Story