ఒక రుషిలా పని చేశారు.. ఓ శకం ముగిసింది : చిరు భావోద్వేగ వ్యాఖ్యలు
Chiranjeevi Condolence Rosaiah Death.మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత
By తోట వంశీ కుమార్ Published on
4 Dec 2021 6:07 AM GMT

మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య(88) ఈరోజు(శనివారం) ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో రోశయ్య ఓ మహానేత అని కొనియాడారు. ఆయన మరణంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు.
'మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడి వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్నలు పొందిన వ్యక్తి రోశయ్యగారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Next Story