పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' కోసం చిరంజీవి, తారక్..!
Chiranjeevi and Jr NTR as chief guests for Puneeth Rajkumar James event.కొద్ది రోజుల క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 1:26 PM GMT
కొద్ది రోజుల క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జేమ్స్'. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రంలో తెలుగు నటుడు శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో పునీత్.. ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
జేమ్స్ చిత్రం.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 17 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో పునీత్ ఆఖరి చిత్రమైన జేమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు దాదాపు అన్ని ఇండస్ట్రీల నుండి ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించారని, దీనికి వీరిద్దరూ ఓకే చెప్పారని సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక పునీత్‌తో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌లకు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.