కలిసి సినిమా చేద్దామని వెంకటేశ్‌ నేనూ అనుకున్నాం: చిరంజీవి

వెంకటేశ్‌ 75 సినిమాల ప్రయాణం పూర్తి కానుంది. దాంతో 'సెలబ్రేటింగ్ వెంకీ 75' పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  28 Dec 2023 8:15 PM IST
chiranjeevi,  victory venkatesh, tollywood,

 కలిసి సినిమా చేద్దామని వెంకటేశ్‌ నేనూ అనుకున్నాం: చిరంజీవి

విక్టరీ వెంకటేశ్‌కు చాలా మంది ఫ్యామిలీ అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూస్తారు. అలాంటి హీరో విక్టరీ వెంకటేశ్‌. అయితే.. వెంకటేశ్‌ 75 సినిమాల ప్రయాణం పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'సెలబ్రేటింగ్ వెంకీ 75' పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్‌ను కొనియాడారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేశ్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్‌ నటించిన 'మల్లీశ్వరి' సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కుటుంబం, యాక్షన్, ప్రేమ ఇలా అన్ని రకాల కథల్లో నటించాడని అన్నారు చిరు. అయితే.. విక్టరీ వెంకటేశ్, తాను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నామనీ.. ఇది ఇద్దరి కోరిక అని చెప్పారు. మంచి కథ కుదిరితో సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కొన్ని వేడుకలు ఎంతో మానసిన ఆనందాన్ఇన ఇస్తాయనీ.. ఈ వేడుకకు వచ్చిన తనకు అలాగే అనిపిస్తోందని అన్నారు. కథ ఎంపికలో ఒక సినిమాకు మరో సినిమాకు పొంతన లేకుండా డిఫరెంట్‌ గా ఆలోచిస్తూ వెంకీ సినిమా ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. ఇకపై కూడా వెంకీ సినీ ప్రయాణం అద్బుతంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఈవెంట్‌ విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. కలియుగ పాండవులు సినిమాతో తన సినిమా ప్రయాణం మొదలైందని చెప్పారు. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌ వంటి అగ్రదర్శకులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అభిమానుల ప్రేమ ఉండటంతోనే ఇన్ని సినిమాలు చేశానని చెప్పారు. మొదట్లో విక్టరీ అనేవారు.. తర్వాత రాజా అని పిలిచారు.. ఆ తర్వాత పెళ్లికాని ప్రసాద్‌అన్నారు. ఆ తర్వాత పెద్దోడు అన్నారు. వెంకీమామా ఇలా పిలుస్తూ ప్రేక్షకులు, అభిమానులే ఉత్సాహాన్ని నింపారని అన్నారు. ఇలా పిలుపు మార్చినా కానీ.. ప్రేమను మాత్రం చూపిస్తూనే ఉన్నారని అన్నారు వెంకటేశ్. 75వ చిత్రం ‘సైంధవ్‌’ గొప్ప సినిమా అవుతుందనీ.. జనవరి 13న అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నట్లు విక్టరీ వెంకటేశ్ అన్నారు.

Next Story