మాస్ లుక్‌లో మెగాస్టార్‌.. పూన‌కాలు మొద‌లాయే

Chiranjeevi 154th movie shooting start.మెగాస్టార్ చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 3:31 PM IST
మాస్ లుక్‌లో మెగాస్టార్‌.. పూన‌కాలు మొద‌లాయే

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన 'ఆచార్య' చిత్రం విడుద‌లు సిద్ద‌మ‌వుతుండ‌గా.. 'లూసిఫ‌ర్' షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్టారు. చిరు కెరీర్‌లో 154వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీకి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌నివారం ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని అభినంద‌లు తెలిపారు. కాగా.. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర‌బృందం చిరు 154వ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

కళ్ళకు గాగుల్స్, చేతిలో సిగరెట్ తో చిరంజీవి మాస్ లుక్‌లో క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ ముఠామేస్త్రి చిత్రంలోని చిరును గుర్తు చేస్తుంద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మైత్రీ మూవీస్ మేక‌ర్స్ ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు.

Next Story