'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక.. చీఫ్‌ గెస్ట్‌గా చిన్నజీయర్ స్వామి

'ఆదిపురుష్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By అంజి  Published on  5 Jun 2023 11:30 AM IST
Chinna Jeer Swamy, Adipurush, Prabhas

'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక.. చీఫ్‌ గెస్ట్‌గా చిన్నజీయర్ స్వామి

'ఆదిపురుష్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్‌ అభిమాన సంఘాలకు పాస్‌లు కూడా అందాయి. తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈ వెంట్‌ జరగనుంది. ఈ ఈవెంట్‌ కోసం నిర్వాహకులు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. కేవలం బాణ సంచాల కోసమే రూ.50 లక్షల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జైశ్రీరామ్‌ అంటూ శబ్దం వచ్చేలా బాణసంచాలను తయారు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గెస్ట్ పేరును ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చినజియర్ స్వామి గెస్ట్‌గా రానున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఈవెంట్‌లో అజయ్ - అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు రానున్నారు. మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్న 'ఆదిపురుష్' సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Next Story