మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి శ్రీపాద

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ లిరిక్ రైటర్ వైరముత్తుపై విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  2 Jan 2024 2:00 PM GMT
Chinmai Sripada,  sensational comments,  vairamuttu,

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి శ్రీపాద

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ లిరిక్ రైటర్ వైరముత్తుపై విరుచుకుపడ్డారు. అంతకు ముందు కూడా ఆమె ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఆప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. అయితే చిన్మయి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమెపై తమిళ చిత్ర పరిశ్రమ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. వైరముత్తు రచించిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, అగ్రశ్రేణి నటుడు కమల్ హాసన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని చిన్మయి శ్రీపాద తప్పుబట్టారు. తనను వేధించిన వ్యక్తికి తమిళనాడులోని కొందరు శక్తిమంతమైన ప్రముఖులు మద్దతిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ కార్యక్రమంలో వైరముత్తుతో పాటు ఎంతమంది రాజకీయవేత్తలు ఉన్నారో చూడండి... ఇలాంటి వాతావరణంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? అని చిన్మయి ఆవేదన వెలిబుచ్చారు. మహిళలను వేధించిన వారికి మద్దతుగా పెద్ద మనుషులు ఉన్నారనే వాదనతో ఆమె ట్వీట్ చేశారు. 2018లో చిన్మయి గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతని ఆరోపణలు నిజం లేదంటూ ఆమెను ఐదేళ్ల పాటు తమిళ్ ఇండస్ట్రీ నుంచి నిషేధం ఎదుర్కొంటూ ఉంది.


Next Story