పుష్ప -2 రికార్డును బద్దలు కొట్టిన ఛావా

విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్, అంచనాల మధ్య విడుదలైంది.

By Medi Samrat  Published on  17 Feb 2025 7:38 PM IST
పుష్ప -2 రికార్డును బద్దలు కొట్టిన ఛావా

విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్, అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. మొదటి వారాంతంలో భారతదేశంలో 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా కూడా మంచి ప్రదర్శన చేస్తోంది.

మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ కావడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను ఆర్జిస్తోంది. మహారాష్ట్రలోనూ పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టింది. మహారాష్ట్రలో కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర ఏరియాల్లో కూడా మెల్లగా పుంజుకుని మంచి ఊపును పొందుతోంది. ఈ చిత్రం ఇప్పటికే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఛావా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల మార్కును దాటింది. 3వ రోజు ఏకంగా 48.5 కోట్లు వసూలు చేసింది. మొదటి ఆదివారం నాడు ఈ చిత్రం మొత్తం 62.48% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో 116.5 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా నటించగా, రష్మిక మందన్న యేసుబాయి భోంసాలే పాత్రలో నటించారు. ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా, హంబీరావ్ మోహితేగా అశుతోష్ రాణా, జినత్-ఉన్-నిస్సా బేగంగా డయానా పెంటీ నటించారు.

Next Story