మహా సముద్రం.. 'చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు'

Cheppake Cheppake Lyrical song out from Maha Samudram.ఆర్ఎక్స్‌-100 చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2021 6:55 AM GMT
మహా సముద్రం.. చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు

'ఆర్ఎక్స్‌-100' చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన టాలెంటెడ్‌ డైరెక్ట‌ర్‌ అజయ్ భూపతి చాలా రోజుల గ్యాప్‌ త‌ర్వాత‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం 'మహా సముద్రం'. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులు. అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. జగపతిబాబు, రావు రమేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 14 న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేశారు. చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు అంటూ ఈ మెలోడి రిలిక‌ల్ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. ప్రేమలో పడిన ఒక యువతి మనసు చేసే అల్లరే ఈ పాట. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్‌ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కెమెరా పనితనం బాగుంది. కాగా.. ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story