ఆస‌క్తిక‌రంగా నితిన్ 'చెక్' ట్రైల‌ర్‌

Check Movie Official Trailer out.యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం చెక్ ట్రైల‌ర్‌ విడుదల.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2021 6:40 PM IST
Check Movie Official Trailer out

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం 'చెక్‌'. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చ‌ద‌రంగం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీశ‌ర్మ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఉరిశిక్ష ప‌డిన ఓ ఖైదీకి చెస్ అంటే చాలా ఇష్టం. జైలు గోడ‌ల మ‌ధ్య ఉంటూనే చ‌ద‌రంగం ఆట‌లో అద‌ర‌గొడుతుంటాడు. త‌న‌ని ఎలాగైనా ఈ కేసు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని ఓ లాయ‌ర్ (ర‌కుల్ ప్రీత్‌) ప్ర‌య‌త్నిస్తుంటుంది. మ‌రి త‌న చ‌ద‌రంగం తెలివితేట‌ల‌తో హీరో.. ఆ జైలు నుంచి ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌. క‌ల్యాణీ మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.




Next Story