చార్మీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. కొద్ది రోజులు పాటు..

Charmy Kaur Sensational Decision.ఛార్మీ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్న‌ట్లు తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2021 5:55 AM GMT
Charmy Kaur

టాలీవుడ్‌లో న‌టిగా, నిర్మాత‌గా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది ఛార్మీ కౌర్. కాగా.. న‌ట‌న‌కు దూర‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నుల్లోనే బిజీగా ఉంది. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మించే చిత్రాల బాధ్య‌త‌ల‌ను చూస్తోంది ఛార్మీ. ఇదిలా ఉంటే.. ఛార్మీ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీనిలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌ను చూడ‌లేక‌పోతున్నాన‌నంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ప్రస్తుత పరిస్థితి మరింత భయంకరంగా మారేట్టు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు వీటన్నంటిని చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నాను. అందరూ ఇంట్లోనే ఉండండి.. మీరు ప్రేమించే వారిని జాగ్రత్తగా చూసుకోండి ఆపోస్టులో ఛార్మీ తెలిపింది.

ఇదిలా ఉండే.. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,59,1710 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 1,761 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో 1,54,761 మంది కోలుకున్నారు.


Next Story