షూటింగ్ గ్యాప్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో చార్మీ చ‌క్క‌ర్లు.. ఫోటోలు వైర‌ల్‌

Charmme Kaur ride with Vijay Devarakonda. 'లైగ‌ర్‌' షూటింగ్‌కి మ‌ధ్య గ్యాప్‌లో చార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్టివా పై చ‌క్క‌ర్లు కొట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 6:53 PM IST
Charmme Kaur ride with Vijay Devarakonda.

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం 'లైగ‌ర్‌'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉప శీర్షిక‌. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. యాక్షన్ అండ్ ఎంటర్టైన్‌మెంట్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. విజయ్ ఫైటర్‌గా క‌నిపించనున్న‌ ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబ‌ర్ 9న లైగ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబ‌యిలో జ‌రుగుతోంది.


విజ‌య్‌పై కీల‌క సన్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. షూటింగ్‌కి మ‌ధ్య గ్యాప్‌లో చార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్టివా పై చ‌క్క‌ర్లు కొట్టారు. దీనికి సంబంధించిన చిత్రాల‌ను చార్మీ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. చార్మీని యాక్టివాను న‌డుప‌గా.. విజ‌య్ వెనుకాల కూర్చున్నాడు. "మీరు చూస్తున్నారు కదా... విజయ్ నాపై గట్టి నమ్మకంతోనే బండెక్కాడు! షూటింగ్ విరామంలో ముంబయి రోడ్లపై ఇలా సరదాగా విహరించాం" అని చార్మీ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.




Next Story