చిరంజీవి పుట్టిన రోజు.. స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేసిన చ‌ర‌ణ్‌

Charan Shares special video viral.ఆగస్టు 22.. ఇది ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులకు పండుగ రోజు. మెగాస్టార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 5:30 AM GMT
చిరంజీవి పుట్టిన రోజు.. స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేసిన చ‌ర‌ణ్‌

ఆగస్టు 22.. ఇది ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులకు పండుగ రోజు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అయనకు అభిమానులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ ను విష్ చేస్తున్నారు. అలాగే ఆయన త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా త‌న తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న తండ్రితో క‌లిసి సెట్‌లో గ‌డిపిన క్ష‌ణాల‌కు సంబంధించిన స్పెష‌ల్ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవిని త‌న కారులో స్వ‌యంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళుతున్న రామ్ చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత సెట్‌లో తండ్రితో క‌లిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న తండ్రి నుంచి చాలా నేర్చుకున్నాన‌ని.. ప్రేమ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక ఈ చిత్రంలో చిరు,చ‌ర‌ణ్‌లు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..' అంటూ చిరు చెప్పిన డైలాగ్ టీజర్‌‌కే హైలైట్‌గా నిలిచింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story