వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉంద‌ని తార‌క‌ర‌త్న చెప్పాడు : చంద్ర‌బాబు

Chandra Babu Emotional About Taraka Ratna Death.వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉంద‌ని తార‌క‌ర‌త్న త‌న‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 1:19 PM IST
వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉంద‌ని తార‌క‌ర‌త్న చెప్పాడు : చంద్ర‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉంద‌ని తార‌క‌ర‌త్న త‌న‌తో చెప్పిన‌ట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. మోకిల‌లోని తార‌క‌ర‌త్న నివాసానికి వెళ్లిన చంద్ర‌బాబు తార‌క‌ర‌త్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 22కి తారకరత్నకు 40 వ‌సంతాలు నిండుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. అమరావతి చిత్రంలోని ఆయ‌న నటనకు నందీ అవార్డును అందుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌నే విష‌యాన్ని చెప్పారు. మాట్లాడి ఓ నిర్ణ‌యం తీసుకుందామ‌ని తార‌క‌ర‌త్న‌తో చెప్పాను. ఇంత‌లోనే ఆయ‌న మ‌ర‌ణించ‌డం బాధాక‌రం. చిన్న వ‌యసులో ఏ ఆశ‌యాల కోసం ప‌ని చేశారో వాటిని ముందుకు తీసుకువెళ్లేలా అభిమానులు కృషి చేయాల‌ని కోరుకుంటున్నాను. తార‌క‌ర‌త్న కుటుంబానికి అండ‌గా ఉంటా అని చంద్ర‌బాబు అన్నారు.

Next Story