చైతూ కోసం బ్రిడ్జీపై నుంచి గోదావ‌రిలో దూకేసిన అభిమాని

Chaitu fan jumped into Godari River.తాజాగా ఓ అభిమాని అక్కినేని నాగ‌చైత‌న్య‌ను క‌ల‌వ‌డానికి ఏకంగా బ్రిడ్జీ మీద నుంచి దూకేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 6:24 AM GMT
Chaitu fan jumped into Godari River video viral

సినీతార‌ల‌కు ఉండే క్రేజే వేరు. వారిని క‌ల‌వాల‌ని, వారితో మాట్లాడాల‌ని, ఓ ఫోటో దిగాల‌ని అభిమానులు ఆశ ప‌డుతుంటారు. అందుకోసం వారు చేసే ప‌నులు ఒక్కోసారి ప్రాణాల మీద తెస్తుంది. అయిన‌ప్ప‌టికి త‌మ అభిమాన న‌టుడిని క‌ల‌వ‌డానికి వారు ఎంత‌కైనా తెగిస్తుంటారు. తాజాగా ఓ అభిమాని అక్కినేని నాగ‌చైత‌న్య‌ను క‌ల‌వ‌డానికి ఏకంగా బ్రిడ్జీ మీద నుంచి దూకేశాడు. వివ‌రాల్లోకి వెళితే.. నాగ చైత‌న్య ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'థ్యాంక్యూ' మూవీలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతోంది.

నాగ‌చైత‌న్య‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. త‌న కోసం వ‌చ్చిన అభిమానుల‌తో షూటింగ్ విరామంలో చైతు ఫోటోలు దిగాడు. ఇక చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో గోదావ‌రి మ‌ధ్య‌లో బోటులో చైతు వెలుతుండ‌గా.. బ్రిడ్జీ మీద నుంచి చాలా మంది షూటింగ్ చూస్తున్నారు. ఇంత‌లో ఓ అభిమాని చైతూను మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూసేందుకు బ్రిడ్జీపై నుంచి నీటిలో దూకేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి పోయాడు. షూటింగ్ అనంత‌రం చైతు అత‌డిని పిలిపించి ఫోటో దిగాడు. మ‌ళ్లీ ఇలాంటి సాహ‌సాలు చేయ‌వ‌ద్దంటూ సున్నితంగా హెచ్చ‌రించి.. అత‌డితో మాట్లాడి పంపించివేశాడు. ఆ అభిమాని నీటిలో దూకిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story