'చావు కబురు చల్లగా' టీజర్ గ్లిమ్స్

Chaavu Kaburu Challaga Teaser Glimpse. యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న చిత్రం చావు క‌బురు చల్లగా టీజర్ గ్లిమ్స్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 12:08 PM IST
Chaavu Kaburu Challaga Teaser

యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్ కు సంబంధించిన‌‌ వీడియోకు మంచి స్పంద‌న వ‌చ్చాయి. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ గ్లిమ్స్‌ను విడుద‌ల చేశారు.

'నువ్వు ఈ ఆసుపత్రికి సిస్టర్ వటగా.. మంచి ఉద్యోగమే ఎతుక్కున్నావ్.. మనం ప్రేమించే అమ్మాయి మనకు తప్ప మిగతా వాళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో.. సూపర్ ఏహే' అని హీరో కార్తికేయ అన‌గా.. 'నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ నే అవుతా' అంటూ లావణ్య బదులిస్తుంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి మల్లిక అనే నర్స్ పాత్ర పోషించింది. వీరిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దాగా సాగే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. డీ-గ్లామరైజ్‌డ్‌ లుక్‌లో లావణ్య త్రిపాఠి నడుస్తుండగా.. వెనుక హీరో కార్తికేయ ఫాలో అవుతున్నారు. ఈ చిత్రంలో ముర‌ళీశ‌ర్మ‌, ఆమని, శ్రీకాంత్ అయ్యంగ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


Next Story