ఆహాలో 'చావుకబురు చల్లగా'.. ఎప్పుడంటే..?

Chaavu kaburu challaga ott release official date fix.లాక్‌డౌన్ నుంచి ఓటీటీల హ‌వా మొద‌లైంది. లాక్‌డౌన్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 6:10 PM IST
ఆహాలో చావుకబురు చల్లగా.. ఎప్పుడంటే..?

లాక్‌డౌన్ నుంచి ఓటీటీల హ‌వా మొద‌లైంది. లాక్‌డౌన్‌లో థియేట‌ర్లు అందుబాటులోకి లేక‌పోవడంతో కొన్ని చిత్రాల‌ను ఓటీటీల‌లో విడుద‌ల చేశారు. థియేట‌ర్లు తెరుచుకున్నా ఓటీటీల హ‌వా త‌గ్గ‌‌లేదు. థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీల్లో విడుద‌ల అవుతున్నాయి. ఓటీటీల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా ఉండ‌డంతో సినిమాల‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఇదిలే ఉంటే.. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కౌశిక్ తెర‌కెక్కించారు.

బ‌స్తీ బాల‌రాజు పాత్ర‌లో కార్తికేయ ఒదిగిపోగా.. భ‌ర్త‌ను కోల్పోయిన యువ‌తి పాత్ర‌లో లావ‌ణ్య మెప్పించింది. అయితే థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఆహా సంస్థ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూసే అవకాశాన్ని ఇస్తోంది. ఏప్రిల్‌ 23న 'చావుకబురు చల్లగా' సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ విష‌యాన్ని ఆహా త‌మ ట్విట‌ర్‌లో వెల్ల‌డించింది. జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బన్ని వాసు ఈచిత్రాన్ని నిర్మించారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పించారు. ‌


Next Story