Celebrity Cricket League 2023 : విజేత‌గా నిలిచిన తెలుగు వారియర్స్

అఖిల్ నేతృత్వంలోని తెలుగు వారియ‌ర్స్ మ‌రోసారి సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్) విజేత‌గా నిలిచింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2023 8:15 AM IST
Celebrity Cricket League, Telugu Warriors,

విజేత‌గా నిలిచిన తెలుగు వారియర్స్

అఖిల్ నేతృత్వంలోని తెలుగు వారియ‌ర్స్ మ‌రోసారి సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్) విజేత‌గా నిలిచింది. విశాఖ‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో భోజ్‌పురి ద‌బాంగ్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంత‌క‌ముందు 2015, 2016, 2017లో వరుసగా మూడు సార్లు టైటిళ్లు చేజిక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది. అయితే.. కరోనా సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా సీసీఎల్ టోర్నీ నిర్వహించలేదు.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన అఖిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 72 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియ‌ర్స్ జ‌ట్టు అఖిల్‌(67) రాణించ‌డంతో 4 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి 6 వికెట్లు కోల్పోయి 89 ప‌రుగులు చేసింది. 58 ప‌రుగుల ల‌క్ష్యాన్ని వికెట్ న‌ష్ట‌పోయి తెలుగు వారియ‌ర్స్ చేధించింది. అశ్విన్, సచిన్ అజేయంగా నిలిచారు. అఖిల్ అక్కినేనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

సీసీఎల్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించారు. అయితే.. రెగ్యుల‌ర్ టీ20ల్లా కాకుండా రెండు ఇన్నింగ్స్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌కు 10 ఓవ‌ర్లు, ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌కు 10 ఓవ‌ర్ల చొప్పున మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించారు.

Next Story