'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌పై ప్ర‌ముఖుల స్పంద‌న‌

Celebrities Reactions for RRR Movie Trailer.ద‌ర్శ‌క‌దీరుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 1:21 PM IST
ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌పై ప్ర‌ముఖుల స్పంద‌న‌

ద‌ర్శ‌క‌దీరుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం)'. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ రోజు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. దీనిని చూసిన వారు సినిమా కోసం ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయాలా అన్న బావ‌న‌కు లోన‌వుతున్నారు అంటే అతిశ‌యోక్తి కాదు. టైటిల్‌కు త‌గ్గ‌ట్లుగానే రౌద్రం, ర‌ణం, రుధిరం అన్నీ క‌నిపించేలా ట్రైల‌ర్‌ను రూపొందించారు రాజ‌మౌళి. కాగా.. ఈ ట్రైల‌ర్ నిజంగా ఓ అద్భుతంగా ఉంద‌ని.. హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోద‌ని అంటున్నారు.

రాజ‌మౌళి స‌ర్.. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌తిపోతుంది. తారక్‌, చ‌ర‌ణ్‌, అలియా, అజ‌య్ దేవ్‌గ‌ణ్ తో పాటు చిత్ర‌బృందానికి అభినందలు అంటూ ట్వీట్ చేశారు.

గ‌ర్వంగా ఉంది. వేరే లెవెల్ - విజ‌య్ దేవ‌ర‌కొండ‌

అద్భుతం మా ఊహ‌ల‌కు మించి ఈ ట్రైల‌ర్‌ని రూపొందిచారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు అద‌ర‌గొట్టారు. రాజ‌మౌళి స‌ర్‌.. మైండ్ బ్లోయింగ్ విజ‌న్ - అనిల్ రావిపూడి

టేక్ ఏ బౌ రాజ‌మౌళి.. ట్రైల‌ర్ అదిరిపోయింది - గోపిచంద్ మ‌లినేని

Next Story