నటుడు నరేశ్ మాజీ భార్యపై కేసు నమోదు

Case filed against Actor Naresh Ex Wife Ramya Raghupathi.సీనియ‌ర్ న‌టుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు న‌రేశ్ మాజీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 5:42 PM IST
నటుడు నరేశ్ మాజీ భార్యపై కేసు నమోదు

సీనియ‌ర్ న‌టుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు న‌రేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. భ‌ర్త పేరు చెప్పి ఆమె డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు ఐదుగురు మ‌హిళ‌లు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యను న‌రేశ్ ఎనిమిది సంవ‌త్స‌రాల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే.. కొన్నాళ్ల క్రితం కొన్ని కార‌ణాల వ‌ల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆమె ఆలనాపాలనా కోసం నరేశ్‌ ఇప్పటికీ కొంతమొత్తంలో చెల్లిస్తున్నారు. కాగా.. న‌రేశ్‌కు చెందిన ప‌లు ఆస్తుల‌ను చూపుతూ రిజిస్ట్రేష‌న్ల పేరిట కొంద‌రి ద‌గ్గ‌ర‌, అధిక వడ్డీ ఆశ చూపి మ‌రికొంద‌రి ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసింది. హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు ఆమె ఏడెనిమిది కోట్లు బయట వసూలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మోస‌పోయిన ఐదుగురు మ‌హిళ‌లు గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో ఆమె గుట్టు ర‌ట్టు అయింది. కాగా.. త‌న మాజీ భార్య వ్య‌వ‌హారంతో త‌న‌కేం సంబంధం లేద‌ని న‌రేశ్ చెబుతున్నారు. మ‌హిళ‌ల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story