చేతికి కట్టుతో కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు పయనం.. ఐశ్వర్యకు ఏమైంది?
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగమవ్వడానికి ఐశ్వర్యారాయ్ బచ్చన్ పయనమయ్యారు.
By M.S.R Published on 16 May 2024 11:27 AM ISTచేతికి కట్టుతో కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు పయనం.. ఐశ్వర్యకు ఏమైంది?
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగమవ్వడానికి ఐశ్వర్యారాయ్ బచ్చన్ పయనమయ్యారు. బుధవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో ఆమెకు సంబంధించిన ఫోటోను తీశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఫ్రెంచ్ రివేరాకు బయలుదేరింది ఐష్. ఆమెతో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా ఉన్నారు. అయితే, ఐశ్వర్య చేతికి గాయం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఐశ్వర్య తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ విమానాశ్రయంలో కనిపించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే ముందు ఐశ్వర్య మీడియాకు చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చింది.
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు ఐశ్వర్య పయనమయ్యారు. ఐష్ తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమెకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.