బుట్ట‌బొమ్మ మ‌రో సెన్సేష‌న్‌

Buttabomma creates another new record. బుట్ట‌బొమ్మ సాంగ్ రీసెంట్‌గా యూట్యూబ్​లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 11:26 AM IST
Buttabomma

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం 'అల వైకుంఠ‌పుర‌ములో'. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. త‌మ‌న్ సంగీత స్వ‌రాల‌ను అందించిన ఈ చిత్రంలోని పాట‌లు ప్రతీ పాటకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాముల', 'బుట్టబొమ్మ' పాటలు జనాల్లోకి విపరీతంగా ఎక్కేశాయి. అలాగే విజువల్స్ పరంగా 'బుట్టబొమ్మ' వీడియో సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్‌‌ని అందుకోవడమే కాకుండా తెలుగులో కనివినీ ఎరుగని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. బన్నీ డ్యాన్స్, పూజా అందంతో కూడిన అభినయం వెరసి పాటను చూపరులు మళ్లీ మళ్లీ చూసేలా వీక్షకులను తెగ మెస్మరైజ్ చేసేస్తుంది. రికార్డ్‌ల మీద రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్‌లో 'బుట్టబొమ్మ' వీడియో సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వస్తుండటం విశేషం.

బుట్ట‌బొమ్మ సాంగ్ రీసెంట్‌గా యూట్యూబ్​లో 601 మిలియన్ల(60 కోట్ల) వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 400 మిలియ‌న్ లైక్స్ రాగా, తెలుగులో ఇలాంటి ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు పాట‌గా రికార్డ్ నెల‌కొల్పింది. బుట్ట‌బొమ్మ సాంగ్స్ సాధిస్తున్న రికార్డ్స్ ప‌ట్ల బ‌న్నీ అభిమానులు చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. బ‌న్ని ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చిత్రంంలో న‌టిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్.. ఈ సినిమాపై అంచ‌నాల‌ను భారీ పెంచేసింది.


Next Story