పెళ్లి తర్వాత 'బ్రతుకు బస్టాండే' అని అంటున్న నితిన్‌

Bus Stande Bus Stande Lyrical released.యంగ్ హీరో నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 5:34 AM GMT
పెళ్లి తర్వాత బ్రతుకు బస్టాండే అని అంటున్న నితిన్‌

యంగ్ హీరో నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. ఇక నితిన్ పెళ్లి సందర్భంగా వదిలిన చిన్న వీడియో అందరనీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలో తాజాగా 'బస్టాండే బస్టాండే' అనే సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. 'నాన్నా.. నవ్వుతోంది. నేను కట్టలేను.. నాన్నా' అంటూ నితిన్ ఏడుస్తూ చెప్పే డైలాగ్ తో ఈ పాట ప్రారంభ‌మైంది. 'బస్టాండే బస్టాండే ఇక బ్రతుకే బస్టాండే..' అంటూ సాగిన ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 'సింపుల్ గా ఉండే లైఫ్.. టెంపుల్ రన్ గా మారే.. రంగు రంగు లోకం చీకట్లో జారే' అంటూ పెళ్లి తర్వాత హీరో లైఫ్ గురించి తెలియజేసే విధంగా లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించారు. సీనియర్ నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Next Story
Share it