డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
Burra Katha girl Naira Shah arrested in drug case.టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో
By తోట వంశీ కుమార్ Published on
16 Jun 2021 9:54 AM GMT

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. 'బుర్రకథ' ఫేమ్ నైరా షా డ్రగ్స్‌కేసులో అరెస్టైంది. ఆమెను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ముంబయిలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరా పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం జుహూ ప్రాంతంలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో కలిసి పార్టీ చేసుకుంది.
సదరు హోటల్‌లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అదే రోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఎన్‌సీబీ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. అయితే, నార్కొటిక్స్ విభాగం అధికారులు వెళ్లే సమయానికి నైరా షా, ఆషిక్ హుస్సేన్ గంజాయి నింపిన సిగరెట్లు తాగుతూ దర్శనిమిచ్చారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లోనూ నైరా షా, ఆషిక్ హుస్సేన్ మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
Next Story