ఆక‌ట్టుకుంటున్న 'బుల్ బుల్ తరంగ్'.. మాయ చేసిన సిధ్ శ్రీరామ్

Bulbul Tarang song from Ramarao on Duty Released.మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 7:39 AM GMT
ఆక‌ట్టుకుంటున్న బుల్ బుల్ తరంగ్.. మాయ చేసిన సిధ్ శ్రీరామ్

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న ర‌జీషా, దివ్యాంశ న‌టిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. 'బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..' అంటూ ఈ పాట సాగుతోంది.సామ్‌ సీఎస్ సంగీతాన్ని అందించ‌గా.. సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను అద్భుతంగా పాడారు. రొమాంటిక్‌ మెలోడీగా సాగుతున్న ఈ పాట‌లో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. సీనియర్ న‌టుడు వేణు తొట్టెంపూడి, నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ ఓ ప్ర‌భుత్వ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

Next Story