పవన్, తేజ్ "BRO" సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్
జూన్ 29న రిలీజ్ అయిన టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2023 10:58 AM ISTపవన్, తేజ్ "BRO" సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్
అందరూ ఎంతో వెయిట్ చేసి ఎదురుచూసిన "BRO" సినిమా టీజర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా యువ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి ఈ సినిమాలో కనిపిస్తారు. జూన్ 29న రిలీజ్ అయిన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 15 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. టీజర్‌ను చూసిన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ డైలాగ్స్ ఎంతో బాగున్నాయని చెబుతున్నారు. ఇక విజువల్స్‌గా కూడా అదిరిపోయేలా ఉందని అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ అభిమానులు.
అయితే.. "BRO" సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సిత్రం చిత్రానికి రీమేక్‌గా వస్తోంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 29న టీజర్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకే విడుదల కావాల్సిన టీజర్ సాంకేతిక కారణాలతో రెండు గంటలు ఆలస్యంగా విడుదల అయింది.
బ్రో టీజర్‌లో పవన్ గెటప్‍లు అదిరిపోయాయి. పంచె కట్టుకుని వింటేజ్ లుక్‌తో కనిపించారు. “కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం” అంటూ స్టైలిష్ లుక్ లో పవన్ కల్యాణ్ డైలాగ్ ఉంది. “సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు” అంటూ తన స్టైల్‍లో పవన్ చెప్పిన డైలాగ్ హైలైట్‍గా నిలిచింది. ఒక నిమిషం 27 సెకన్లు ఉన్న ఈ టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. టీజర్‌లోనే పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ అదరగొట్టారు. కాగా.. జూలై 28 బ్రో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. బ్రో సినిమాలో కాలాన్ని నిర్దేశించే దేవుడి పాత్ర పోషిస్తున్నాడు పవన్ కళ్యాణ్. హీరో సాయి ధరమ్ తేజ్‍కు జోడీగా కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటల రచయితగా ఉన్నారు. ఎస్.థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.