'బ్రహ్మాస్త్రం' ట్రైలర్.. ప్ర‌తీ సీన్ అద్భుత‌మే

Brahmastra Part One Shiva Official Trailer Out.రణబీర్ కపూర్, అలియా భట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 5:55 AM GMT
బ్రహ్మాస్త్రం ట్రైలర్.. ప్ర‌తీ సీన్ అద్భుత‌మే

రణబీర్ కపూర్, అలియా భట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ చిత్రం 'బ్ర‌హ్మాస్త్ర‌'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున, మౌనీ రాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సుమారు రూ.400 కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ చిత్రం మూడు భాగాలుగా విడుద‌ల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టులోని తొలి భాగాన్ని బ్ర‌హ్మ‌స్త్రం.. పార్ట్-1 శివ పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

'నీరు, గాలి, నిప్పు..కొన్నివేల సంవ‌త్స‌రాలుగా ఈశ‌క్తుల‌న్నీ కొన్ని అస్త్రాల‌తో ఇమిడి ఉన్నాయి. ఈ క‌థ అస్త్రాల‌న్నింటికీ అధిప‌తి అయిన బ్ర‌హ్మాస్త్రానిది. ఆ బ్ర‌హ్మాస్త్రం విధి త‌న అర‌చేతి రేఖ‌ల‌తో చిక్కుకుని ఉంద‌న్న విష‌యం ఆ యువ‌కుడికే తెలియ‌దు. అత‌నే శివ' అంటూ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ప్ర‌తీ సీన్ విజువ‌ల్ వండ‌ర్ గా అనిపిస్తోంది. ఓ వైపు ప్రేమ జంట‌ను చూపిస్తూనే, బ్ర‌హ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ‌, నంది అస్త్రం దుష్ట‌శ‌క్తుల‌తో చేసే పోరాట స‌న్నివేశాలు హాలీవుడ్ చిత్రాన్ని త‌ల‌పించేలా ఉన్నాయి. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో ఈచిత్రం విడుద‌ల కానుంది.

Next Story