బ్రహ్మస్త్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Brahmastra OTT release date fix.ర‌ణ్‌బీర్, ఆలియా జంట‌గా న‌టించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2022 10:57 AM IST
బ్రహ్మస్త్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ర‌ణ్‌బీర్, ఆలియా జంట‌గా న‌టించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అమితాబ్, నాగార్జున , మౌనీ రాయ్ లు కీలక పాత్ర‌ల్లో న‌టించారు. సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. దాదాపు రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుద‌లతుందా అని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారికి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ శుభ‌వార్త చెప్పింది. న‌వంబ‌ర్ 4 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందనుంది. అందులో మొద‌టి భాగం 'శివ' పేరుతో రిలీజైంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Next Story