బాలీవుడ్ జంట రణ్‌బీర్, అలియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బ్రహ్మస్త్ర'. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ.400 కోట్లు రాబట్టింది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, కింగ్ అక్కినేని నాగార్జునలు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పించారు.
తెలుగులో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ దక్కించుకుంది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందనుంది. అందులో మొదటి భాగం 'శివ' పేరుతో రిలీజైంది. రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.