రామ్ 'స్కంద'.. మామూలు రికార్డు కాదు..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది

By Medi Samrat  Published on  27 July 2024 8:38 PM IST
రామ్ స్కంద.. మామూలు రికార్డు కాదు..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఈ సినిమా మీద బాగా వచ్చాయి. అయితే స్కంద కు హిందీలో మాత్రం భారీగా వ్యూస్ వస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ స్కంద సినిమాపై భారీగా ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. స్కంద సినిమాకు యూట్యూబ్ లో వ్యూస్.. కేవలం 1 నెలలోనే 100 మిలియన్ల వ్యూస్ దాటాయి.

Wamindia Movies యూట్యూబ్ ఛానెల్‌లో నెల రోజుల క్రితం స్కంద విడుదలైంది. ఈ చిత్రం కేవలం ఒక నెల వ్యవధిలో 1 మిలియన్ కంటే ఎక్కువ లైక్‌లతో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకుంది. యూట్యూబ్‌లో విడుదలైన వెంటనే నార్త్ ఇండియన్ ప్రేక్షకులు మాస్ మసాలా చిత్రాలను చూస్తున్నారు. రామ్ గత చిత్రాలు కూడా యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ ను సాధించాయి. 100 మిలియన్ల వ్యూస్‌తో 10కి పైగా రామ్ చిత్రాలు యూట్యూబ్ లో ఉన్నాయి. మరోవైపు, రామ్ తన కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆగస్టు 15 న విడుదలకు సిద్ధంగా ఉంది.

Next Story