ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ..!
Bollywood Heroine Warina Hussain in NTR 30th movie. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2021 1:36 PM ISTదర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు 30వ సినిమా. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా కొనసాగుతోంది. త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్దం చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని.. ఓ కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ వరీనా హుస్సేన్‌ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇప్పటికే ఫొటోషూట్ కోసం ఆమెను హైదరాబాద్ రప్పించాడట. దీంతో వరీనా హైదరాబాద్‌కు వచ్చిందని టాలీవుడ్‌లో టాక్.
ఈ అమ్మడు దబాంగ్-3 చిత్రంలో సల్మాన్‌తో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. మరో హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నారని టాక్. ఉగాది తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి 'అయినాను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'అరవింత సమేత' ఘన విజయం సాధించడంతో.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.