ఆస్పత్రి నుంచి హీరోయిన్‌ జాన్వీ కపూర్ డిశ్చార్జ్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 12:00 PM IST
Bollywood, heroine janhvi Kapoor, discharge,  hospital

 ఆస్పత్రి నుంచి హీరోయిన్‌ జాన్వీ కపూర్ డిశ్చార్జ్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని ఆమె తండ్రి బోనీకపూర్ చెప్పారు. కాగా.. ఈ నెల 18వ తేదీన జాన్వీకపూర్‌ ఫుడ్‌పాయిజన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు వివరాలను బోనీ కపూర్ వెల్లడించారు. 'ఫుడ్‌ పాయిజన్ కారణంగా గురువారం అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేర్పించాం. ఆరోగ్యం మెరుగుపడటంతో నిన్న ఉదయం ఇంటికి తీసుకొచ్చాం' అని వెల్లడించారు.

ఈ నెల 18న ఆమె నీరసంగా ఉందంటూ కుటుంబ సభ్యులతో చెప్పారు. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌‌కు గురైనట్టు తెలిపారు. ఇప్పుడామె కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జాన్వీ కపూర్ ఇటీవల బాయ్‌ఫ్రెండ్ షిఖార్‌తో కలిసి అనంత్ అంబానీ-రాధిక వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుసగా మూవీస్‌లో నటిస్తూ జాన్వీ బిజీగా ఉంది. గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘ఉలఝ్‌’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంది. మరోవైపు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తోన్న దేవర సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరోవైపు బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

Next Story