ముంబైలో ట్రాఫిక్‌ కష్టాలు..షూటింగ్‌కు మెట్రో రైల్లో వెళ్లిన హృతిక్ రోషన్

హృతిక్‌ రోషన్‌ ఉన్నట్లుండి ముంబై మెట్రోలో కనిపించారు. ఆయన్ని చూసిన ప్రయాణికులంతా షాక్‌ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 2:00 PM IST
Bollywood, hero hrithik roshan, metro rail, journey,  mumbai,

 ముంబైలో ట్రాఫిక్‌ కష్టాలు..షూటింగ్‌కు మెట్రో రైల్లో వెళ్లిన హృతిక్ రోషన్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. ఆయన ఎక్కడైనా కనిపిస్తే చాలని అనుకుంటుంటారు అభిమానులు. అయితే.. హృతిక్‌ రోషన్‌ ఉన్నట్లుండి ముంబై మెట్రోలో కనిపించారు. ఆయన్ని చూసిన ప్రయాణికులంతా షాక్‌ అయ్యారు. ఏంటి నిజంగానే హృతిక్ రోషన్‌ వచ్చాడా అనుకున్నారు. వెంటనే తేరుకుని ఆయనతో ఫొటోలు దిగి.. కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ మెట్రోలో ప్రయాణం చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే.. బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తాను ముంబై మెట్రోలో ప్రయాణం చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా చెప్పారు. మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. వేడి నుంచి.. ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు మెట్రోలో ప్రయాణం చేసినట్లు హృతిక్‌ క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. అయితే.. హృతిక్ రోషన్‌ సినిమా షూటింగ్ కోసం బయల్దేరారు. కానీ.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. దాంతో.. షూటింగ్‌ స్పాట్‌కు సమయానికి వెళ్లడం కోసం ఆయన మెట్రోలో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే మెట్రోలో ప్రయాణించడం అద్భుతంగా ఉందని అన్నారు. కొందరు ప్రయాణికులు.. అభిమానులు తనని కలిశారని వారి తనతో ప్రేమ పంచుకున్నారంటూ ఫొటోలను షేర్ చేశారు. ప్రయాణికులు కూడా హృతిక్‌ రోషన్‌ను చూసి ఎంతో సంతోషంగా ఫీల్‌ అయ్యారు. దాదాపుగా అందరూ ఆయనతో సెల్ఫీలను తీసుకున్నారు.

అయితే.. సోషల్‌ మీడియాలో తన మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను హృతిక్ రోషన్‌ పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. చాలా మంది అభిమానులు చాలా బాగున్నారంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కొందరైతే తాము కూడా ఆ సమయానికి మెట్రోలో ఉండి ఉంటే బాగుండేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story