ముంబైలో ట్రాఫిక్ కష్టాలు..మెట్రో ఎక్కిన హీరో అక్షయ్‌కుమార్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 10:38 AM ISTముంబైలో ట్రాఫిక్ కష్టాలు..మెట్రో ఎక్కిన హీరో అక్షయ్‌కుమార్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే. వాహనాల రద్దీ ఎప్పుడూ ఉంటుంది ముంబైలో. ఈ క్రమంలోనే పనులపై వెళ్లేవారు సమయానికి చేరుకోలేకపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించికునేందుకు చాలా మంది మెట్రో రైల్ సేవలను వినియోగించుకుంటున్నారు. కొందరు బాలీవుడ్ నటులు కూడా మెట్రోలో ప్రయాణం చేశారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా మెట్రోలో ప్రయాణం చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాత దినేశ్ విజన్‌తో కలిసి అక్షయ్ గురువారం ముంబై మెట్రో రైల్‌లో ప్రయాణం చేశారు. బ్లాక్ డ్రస్ ధరించిన అక్షయ్ కుమార్.. మ్యాచింగ్ టోపీతో కనిపించారు. ఎవరూ తనని గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ కూడా పెట్టుకున్నారు అక్షయ్. అయితే.. కొందరు అభిమానులు మాత్రం ఆయన్ని గమనించి దూరం నుంచే వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఇవే వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకే అక్షయ్ కుమార్ ముంబై మెట్రోలో ఎక్కారంటూ పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ముంబై ట్రాఫిక్ అంశంపై చర్చ జరుగుతోంది.
ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ ఈ సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ పనిచేస్తుంది. మరో సినిమా 'సింగం అగైన్'లో కూడా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
#AkshayKumar travelling in a 🚇 pic.twitter.com/31Z9F9tsGN
— $@M (@SAMTHEBESTEST_) January 11, 2024