ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

తాజాగా బిగ్‌బీ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  15 March 2024 3:29 PM IST
bollywood, amitabh bachchan,  hospital,

ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

సినిమా ఇండస్ట్రీలో గొప్ప పేరున్న నటుల్లో ఒకరు అమితాబ్‌ బచ్చన్‌. అద్భుతమైన చిత్రాల్లో నటనతో మెప్పించి సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితం అయిన ఆయన ఇప్పుడు ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు. సినిమాల్లోనే కాదు టెలివిజన్ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తో బాగా పాపులర్ అయ్యారు. 81 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలు, షోలల్లో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్‌బీ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా ముంబైలోని కొకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ భుజం నొప్పి కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా బిగ్‌ బీ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘T 4950-ఎప్పటికీ కృతజ్ఞతతో.’అంటూ పోస్ట్ చేశారు. అదే విధంగా ‘T 4950 – ఆంఖ్ ఖోల్కే దేఖ్ లో, కాన్ లగాకే సున్ లో, మాఝా ముంబై కి హోగీ జై జైకార్, యే బాత్ అబ్ మాన్లో,’అంటూ మ్యాచ్ సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కొన్ని జ్ఞాపకాలకు సంబంధించిన వీడియో షేర్ చేశారు.

2024 ఏడాది ప్రారంభంలో అమితాబ్‌ బచ్చన్‌ మణికట్టు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కరోనా సమయంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏ కారణంతో ఆస్పత్రిలో చేరారనే విషయంపై క్లారిటీ రాలేదు. అధికారిక ప్రకటన లేదు. సాధారణ చెకప్‌ కోసమే వెళ్లి ఉంటారని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం అమితాబ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తోన్న ప్రభాస్‌ కల్కి మూవీలో కూడా నటిస్తోన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న అమితాబ్‌ ఆస్పత్రిలో నుంచి క్షేమంగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story