సింపుల్ గా కనిపించే శ్రద్ధా కపూర్ శారీ ధర ఎంతో తెలుసా?

శ్రద్ధా కపూర్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

By M.S.R  Published on  15 Jun 2024 8:30 PM IST
Bollywood, actress shradha Kapoor, saree,

సింపుల్ గా కనిపించే శ్రద్ధా కపూర్ శారీ ధర ఎంతో తెలుసా?

శ్రద్ధా కపూర్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మడు తెలుగులో సాహో సినిమాలో నటించి ఇక్కడ కూడా మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక శ్రద్ధా కపూర్ సాధారణంగా ఈవెంట్ లకు వెళ్లదు. చాలా అరుదుగా ఈవెంట్ లకు హాజరైనా కూడా.. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె ఆమె వేసుకునే డ్రెస్ లలో ఎక్కువగా ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి.

శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న 'స్ట్రీ 2' సినిమా టీజర్ లాంచ్‌లో శ్రద్ధా కపూర్ అందమైన ఎరుపు రంగు పూల చీరలో కనిపించింది. ధృవి పంచల్ డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరలో అమ్మడు కనిపించింది. పసుపు, గులాబీ, తెలుపు రంగుల ప్రకాశవంతమైన రంగులలో ఆర్గాన్జా ఫాబ్రిక్‌ తో, పూల కలంకారి ప్రింట్‌ ఉన్న చీరలో కనిపించింది. ఆమె చీరను స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, విశాలమైన పట్టీలను కలిగి ఉన్న మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్‌తో ధరించింది. ఇక ఆమె చీర ధర 31,500 రూపాయలు. ఈ తరహా చీర ఎక్కడ దొరుకుతుందా అని నెటిజన్లు చర్చించుకుంటూ ఉన్నారు.


Next Story