సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బాలీవుడ్‌ నటి మృతి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రవీణా దేశ్‌పాండే ఇకలేరు.

By -  అంజి
Published on : 18 Feb 2026 6:55 AM IST

Praveena Deshpande death, Bollywood actress demise, Praveena Deshpande movies, Senior actress passes away, Hindi TV serial actress death

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బాలీవుడ్‌ నటి మృతి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రవీణా దేశ్‌పాండే ఇకలేరు. సుమారు ఆరు దశాబ్దాల వయసులో ఆమె అనారోగ్య కారణాలతో మరణించడం సినిమా రంగానికి తీరని లోటు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

ప్రవీణా దేశ్‌పాండే కేవలం వెండితెరపైనే కాకుండా, టెలివిజన్ రంగంలోనూ సుపరిచితులు. ఆమె పోషించిన పాత్రల్లో సహజత్వం, హుందాతనం ఉట్టిపడేవి. ఆమె పలు సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా తల్లి, అత్త వంటి క్యారెక్టర్ రోల్స్‌లో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. అనేక హిందీ ధారావాహికల్లో నటించి ఇంటింటికీ చేరువయ్యారు. మాతృభాష అయిన మరాఠీలో పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరాఠీ సినిమాలతో పాటు టీవీ, వెబ్‌ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతో పాటు ఏక్‌ విలన్‌, పరమాణు తదితర ఎన్నో సినిమాల్లో కనిపించారు.

ఆమె మరణవార్త విన్న బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "ఒక క్రమశిక్షణ కలిగిన నటిని, మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాము" అంటూ పలువురు దర్శకులు, సహ నటులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Next Story