నేను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే వీడియో
బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 7:46 AM GMTనేను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే వీడియో
బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది. ఆ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ముందుగా ఈ వార్త ఎవరూ నమ్మలేదు కానీ.. పూనమ్ పాండే పీఆర్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక నోట్‌ని విడుదల చేశారు. దాంతో.. నిజంగానే పూనమ్ పాండే చనిపోయిందని భావించారు కొందరు. ఇంకా కొందరు మాత్రం ఆమె డెడ్‌బాడీ ఎక్కడా కనిపించడం లేదనీ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా నేరుగా పూనమ్ పాండే నుంచే ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది.
ఈ మేరకు వీడియోలో మాట్లాడిన పూనమ్ పాండే.. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం తాను చనిపోయినట్లు వార్లు సృష్టించినట్లు తెలిపింది. తన మరణవార్త విషయంలో అందరూ తనని క్షమించాలని పూనమ్ పాండే కోరింది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ అవుతోందనీ.. దీనిపై అవగాహన కల్పించడం కోసమే తాము ఇలా చేసినట్లు చెప్పింది.
గర్భాశయ క్యాన్సర్ తనకు లేదనీ.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని పూనమ్ పాండే వెల్లడించింది. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలా మంది మహిళలు మన దేశంలో ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినదని పూనమ్ పాండే వీడియోలో పేర్కొన్నారు. HPV వ్యాక్సిన్‌ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చని చెప్పారు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు వ్యైద్యశాస్త్రంలో ఉన్నాయని వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దమంటూ పూనమ్ పాండే పిలుపునిచ్చారు. కాగా.. ఆమె ప్రాణాలతో ఉందనే వార్త విన్న అభిమానులు హమ్మయ్య అంటున్నారు. కొందరు ఆమె చేసిన పనిని విమర్శిస్తుంటే.. ఇంకొందరు అవగాహన కోసం చేసింది కదా అంటున్నారు.