మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్న సోనూసూద్‌.. నిరుద్యోగుల‌కు ఈ-రిక్షాలు పంపిణీ

Bollywood Actor Sonu Sood distributed by E-Rickshaw.బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 5:36 AM GMT
మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్న సోనూసూద్‌.. నిరుద్యోగుల‌కు ఈ-రిక్షాలు పంపిణీ

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. సినిమాల్లో విల‌న్‌గా నటిస్తున్న‌ప్ప‌టికి నిజ‌జీవితంలో రియ‌ల్ హీరోగా నిలిచారు. లాక్‌డౌన్ కాలంలో వ‌ల‌స కూలీల‌ను త‌మ స్వ‌స్థ‌లాల‌కు పంపిండంతో మొద‌లైన సోనూసేవ‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. అడిగిన వారికి కాద‌న‌కుండా, లేద‌న‌కుండా సాయం చేస్తూ అంద‌రి చేత ప్ర‌శంస‌లు పొందుతున్నాడు. ఇక సోనూసూద్ చేసే మంచి ప‌నుల‌ను మెచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలోని ఓ ఊరిలో అత‌డికి గుడిని సైతం నిర్మించారు. ఇక లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఎత్తివేశాక షూటింగ్‌లో పాల్గొంటున్న‌ప్ప‌టికి త‌న సేవ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నాడు సోనూసూద్‌.

తాజాగా త‌న స్వ‌స్థ‌ల‌మైన పంజాబ్‌లోని మోగా ప‌ట్ట‌ణంలో ఎనిమిది మంది నిరుద్యోగ‌ల‌కు ఈ-రిక్షాలు(ఎలక్ట్రిక్‌ రిక్షాలు) ల‌ను పంపిణీ చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న సోద‌రి మాళ‌విక స‌చార్‌, బావ గౌత‌మ్ స‌చార్ లు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సోనూసూద్‌ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని ఆశించారు. తనకు సేవాగుణం అలవడటానికి తన తల్లిదండ్రులే కారణమని చెప్పారు. సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరూ అవసరమైనవారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైనవారికి తాను సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని సోనూసూద్ చెప్పారు.


Next Story
Share it