బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కరోనా
Bollywood actor kangana ranuat test positive.కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే ఎంతో
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 6:17 AM GMT
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ఈ మహమ్మారి బారిన పడగా.. అందులో కొద్ది మంది కోలుకోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫైర్ బ్రాండ్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తనకు స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపిస్తుండండంతో హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని.. అందులో భాగంగానే శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ రోజు టెస్టు రిపోర్టులు వచ్చాయని.. తనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు చెప్పింది.
ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసోలేట్ అయినట్లు తెలిపింది. 'ఇప్పుడు నాకు తెలిసిందిల్లా ఒక్కటే. వైరస్‌ని ధైర్యంగా, బలంగా ఎదుర్కోవాలి. దయచేసి మనో ధైర్యం అనే మీ బలాన్ని వేరొకరి చేతిలో పెట్టకండి. మీరు భయపడితే అది ఇంకా మిమ్మల్ని భయపెడుతుంది. కొవిడ్-19 ను ఓ రకమైన జలుబుగా బావించండి. అందరం కలిసి దానిపై ధైర్యంగా పోరాటం చేద్దాం' అని కంగనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పిలుపు నిచ్చింది. ధ్యానం చేస్తున్న ఓ ఫోటోలను షేర్ చేసింది.