అక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం.. భారత మ్యాప్‌పై అలా ఎలా నడుస్తావంటూ కామెంట్స్‌

Bollywood actor Akshay kumar walk on India map raises the hackles of Netizens. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఉత్తర అమెరికా

By అంజి  Published on  7 Feb 2023 10:55 AM IST
అక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం.. భారత మ్యాప్‌పై అలా ఎలా నడుస్తావంటూ కామెంట్స్‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఉత్తర అమెరికా పర్యటనకు ముందు అక్షయ్ కుమార్ గ్లోబ్‌పై ఉండే భారతదేశ మ్యాప్‌పై నడుస్తున్నట్లు చూపించిన ప్రమోషనల్ వీడియోపై నెటిజన్ల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడు. భారత్‌ మ్యాప్‌పై షూస్‌ ధరించి నడవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. అక్షయ్‌కుమార్‌ ఆదివారం నాడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వివాదాస్పద వీడియోను అప్‌లోడ్ చేశారు. అయితే అక్షయ్ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ రాకపోగా.. వారు వెంటనే అక్షయ్‌ కుమార్‌ భారతదేశ మ్యాప్‌పై నడిచి అగౌరవపరిచారని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో బాలీవుడ్‌ హీరోయిన్లు దిశా పటానీ, మౌని రాయ్, నోరా ఫతేహి, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు. అదృష్టవశాత్తూ వారు భారతదేశ మ్యాప్‌లో నడవలేదు. దీంతో వారు నెటిజన్ల ఆగ్రహజ్వాలల నుండి తప్పించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో నార్త్ అమెరికా టూర్ ఆఫ్ ది స్టార్స్‌ను ప్రమోట్ చేయడానికి ఈ వీడియో రూపొందించబడింది. వీడియోను పంచుకుంటూ అక్షయ్ ట్వీట్ చేసాడు. ''ఉత్తర అమెరికాకు 100 శాతం దేశీ వినోదాన్ని తీసుకురావడానికి ఎంటర్టైనర్లు సిద్ధంగా ఉన్నారు. మీ సీటు బెల్టులు కట్టుకోండి, మేము మార్చిలో వస్తున్నాము'' అని రాసుకొచ్చారు.

ఈ వీడియో అక్షయ్‌ కుమార్‌ భారత్‌ను అగౌరవపరిచాడని నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది నెటిజన్లు అక్షయ్ కెనడియన్ పౌరసత్వాన్ని ఎత్తి చూపుతున్నారు. అతని విధేయత గురించి పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. భాయి మన భారత్‌ను కాస్తైనా గౌరవించాల్సింది అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. చాలా మంది నెటిజన్లు కెనడియన్‌ కుమార్‌ అంటూ ఎగతాళి చేశారు. తన కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు, భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్షయ్‌ కుమార్‌ ఇంతకుముందు పేర్కొన్నాడు.


Next Story