చిరంజీవి చెల్లికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన 'భోళా శంకర్‌' టీం

Bola Shankar Team wishes Keerthy Suresh.నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిన్న‌ది కీర్తి సురేష్‌. అందం,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Oct 2021 6:19 AM GMT
చిరంజీవి చెల్లికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన భోళా శంకర్‌ టీం

'నేను శైల‌జ' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిన్న‌ది కీర్తి సురేష్‌. అందం, న‌ట‌న‌తో తొలి చిత్రంతోనే ఆక‌ట్టుకుంది. అన‌తికాలంలో సౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా చోటు ద‌క్కింది. 'మ‌హాన‌టి' చిత్రంతో జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును సొంతం చేసుకుంది. నేడు ఈ భామ పుట్టిన రోజు. ఆదివారం ఈ భామ 29వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా కీర్తి న‌టిస్తున్న ప‌లు చిత్రాల‌లో ఆమె లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్లు విడుద‌ల అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళా శంక‌ర్' చిత్రం తెర‌కెక్కుతోంది. త‌మిళ చిత్రం 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెల్లిగా కీర్తి న‌టిస్తోంది. చిత్ర బృందం ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. 'నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, టాలెంటెడ్‌ కీర్తిసురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్‌ చేసింది.

తెలుగులో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న 'స‌ర్కారు వారి పాట' చిత్రంలో కూడా కీర్తి న‌టిస్తోంది. 'మా అంద‌మైన‌, ప్ర‌తిభావంతురాలైన క‌ళావ‌తికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు' అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది.

కీర్తిసురేష్..1992లో అక్టోబర్ 17న సురేష్, మేనక దంపతలకు జన్మించింది. తండ్రి మలయాళంలో పెద్ద దర్శక, నిర్మాత. తల్లి మేనక మలయాళంలో పెద్ద హీరోయిన్. మేనక అప్పట్లో చిరంజీవి 'పున్నమినాగు'లో నాయికగా నటించారు.

Next Story