ఇదేం పాడుపని.. కరోనా ఉందని తెలిసి కూడా..
BMC files FIR against actor Gauhar Khan for flouting Covid-19 protocol. బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్ ఈ మధ్యే ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతూ పాజిటివ్ తోనే షూటింగ్ కు వచ్చింది.
By Medi Samrat Published on 16 March 2021 5:11 AM GMT
ప్రపంచంలో చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ఎంత వినాశనాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రాణలు, ఆర్థిక నష్టమే కాదు కోట్లది మందిని నిరుద్యోగులుగా మిగిల్చంది. అయితే ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నారు. లాక్ డౌన్ విధించిన కాస్త కట్టుదిట్టం చేసినా.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో మరోసారి ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంత మందిమాత్రం ఇవేవే పట్టనట్టు కరోనా ఉన్నా కూడా జనాల్లో తిరుగుతున్నారు. తాజాగా ఓ టివి, సినీ నటి తనకు కరోనా ఉన్నప్పటికీ షూటింగ్ హాజరై కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్ ఈ మధ్యే ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమెను క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతూ పాజిటివ్ తోనే షూటింగ్ కు వచ్చింది. అందుకే కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు ముంబై పోలీసులు. క్వారంటైన్ లో ఉండాలంటూ వైద్యులు కూడా సూచించినప్పటికీ.. గౌహార్ షూటింగ్‌కు వచ్చిందని BMC అధికారి తెలిపారు. దాంతో ఈమెపై బీఎంసీ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసారు.
ఈ ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. అంతేకాదు దీనిపై పౌరసంఘం కూడా ట్వీట్ చేసింది. కోవిడ్ 19 మార్గదర్శకాలను పాటించనందుకు బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్‌పై BMC ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కోవిడ్ నిబంధనలు సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా కఠినంగా వర్తిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఈమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కనీసం ఫోన్స్ కు కూడా రెస్పాండ్ కావడం లేదు గౌహార్ ఖాన్. వీలైనంత త్వరగా ఈమె జాడ కనుగొంటామని చెప్తున్నారు ముంబై పోలీసులు