బాల‌య్య పుట్టిన రోజు.. చిరు, వెంకీ, మహేష్, ఎన్టీఆర్‌ స్పెషల్ విషెస్

Birthday wishes to Nandamuri balakrishna.సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 8:00 AM GMT
బాల‌య్య పుట్టిన రోజు.. చిరు, వెంకీ, మహేష్, ఎన్టీఆర్‌ స్పెషల్ విషెస్

సినీన‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పాటుగా టాలీవుడ్ ప్రముఖులు విషెస్ తెలియచేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య-బోయపాటి సినిమా 'అఖండ' నుంచి న్యూ పోస్టర్ విడుదల కాగా.. ఆయన తదుపరి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని అంటూ వీడియో విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్.

'మిత్రుడు బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' - చిరంజీవి

'జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' - జూ.ఎన్టీఆర్‌

'మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' - మ‌హేష్ బాబు

'ప్రియమైన బాలకృష్ణ గారు !! మీకు ప్రశాంతమైన మరియు సురక్షితమైన సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాము' - విక్ట‌రీ వెంక‌టేష్‌

'నవయవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్నీ శుభాలే జరగాలని దేవుడ్ని కోరుకుంటున్నాను' అంటూ ద‌ర్శ‌కుడు క్రిష్ ట్వీట్ చేశారు. 'నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నాను' - దర్శ‌కుడు సురేందర్‌ రెడ్డి

'హ్యాపీ బర్త్‌డే బాలయ్య బాబు గారు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో కలవడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. మీ సింహగర్జనను ప్రత్యేక్షంగా చూసేందుకు సిద్ధంగా ఉన్నాను' - ద‌ర్శ‌కుడు గోపించంద్ మ‌లినేని


Next Story
Share it