ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి బిపాసా బసు
By Medi Samrat
బాలీవుడ్ నటి బిపాసా బసు పాపకు జన్మనిచ్చింది. బాలీవుడ్ వర్గాల కథనాల మేరకు బిపాసా శనివారం ఉదయం ఆడబిడ్డకు కు జన్మనిచ్చిందట. ఆగస్టులో, ఈ జంట తమ జీవితంలో చాలా గొప్ప విషయానికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అప్పటి నుండి, నటి తన గర్భధారణ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కరణ్, బిపాషా తల్లిదండ్రులు అయ్యారు. బిపాసా బేబీ బంప్ ఫోటోషూట్‌లు, ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల ప్రేమకథ 'ఎలోన్' సెట్స్‌లో మొదలైంది. కరణ్ 'ఎలోన్' షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే జెన్నిఫర్ వింగెట్ తో వివాహ బంధంలో ఉన్నాడు. బిపాసాతో ఎఫైర్ వార్తల నేపథ్యంలో కరణ్ - జెన్నిఫర్ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కరణ్ 2016 లో బిపాసాను వివాహం చేసుకున్నారు. ఈ జంట జీవితంలోకి మరొకరు ప్రవేశించారు. ప్రస్తుతం వీరి బిడ్డను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.