'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Bimbisara OTT Release Date Fix.నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార.
By తోట వంశీ కుమార్ Published on 15 Oct 2022 9:24 AM ISTనందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం 'బింబిసార'. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో బాగా ఆడిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దసరాకే వస్తుందని చాలా మంది బావించగా వారికి నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వారికి ప్రముఖ ఓటీటీ జీ 5 శుభవార్త అందించింది. దీపావళి కానుకగా ఈ నెల 21 'బింబిసార'ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. "కింద ఒకడు ఉన్నాడు, వాడి పేరు బింబి, త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి " అంటూ జీ5 ట్వీట్ చేసింది.
నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఫాటసీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయికలుగా నటించగా కళ్యాణ్ రామ్ బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు.
కింద ఒకడు ఉన్నాడు, వాడి పేరు బింబి, త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి!!!
— ZEE5 Telugu (@ZEE5Telugu) October 14, 2022
Meet #BimbisaraOnOctober21#BimbisaraOnZee5 #Bimbisara@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/pNyJI4xgJM
కథే ఏమిటంటే..? క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు క్రూరత్వానికి ప్రతీక. అతడి కన్ను పడ్డ ఏ రాజ్యమైనా త్రిగర్తల సామ్రాజ్యంలో భాగం అవ్వాల్సిందే. మాయదర్పణం కారణంగా ప్రస్తుతానికి వస్తాడు. ఈ వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురు అయ్యాయి ? విధి అతనికి ఎలాంటి పాఠాలు నేర్పింది ? ఆ కాలంలో దాచిన నిధి తలుపులు తెరవడం కోసం ఈ కాలంలో సుబ్రహ్మణ్యశాస్త్రి ఎందుకు ప్రయత్నిస్తుంటాడు..? బింబిసారుడు తిరిగి తన కాలానికి ఎలా వెళ్లాడు అనేది కథ.