బింబిసార నుంచి 'ఓ తేనె ప‌లుకుల' పాట‌.. రిలీజ్‌ టైమ్‌ ఫిక్స్!

Bimbisara O Tene Palukula Audio Song on 21st July. నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ మెయిన్‌ రోల్‌లో నటించిన మూవీ 'బింబిసార'. ఈ సినిమాకు వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు.

By అంజి  Published on  19 July 2022 9:16 PM IST
బింబిసార నుంచి ఓ తేనె ప‌లుకుల పాట‌.. రిలీజ్‌ టైమ్‌ ఫిక్స్!

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ మెయిన్‌ రోల్‌లో నటించిన మూవీ 'బింబిసార'. ఈ సినిమాకు వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమాలో కేథ‌రిన్ థెరిస్సా, సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

'ఓ తేనె పలుకుల' సాంగ్‌ను జులై 21న రిలీజ్‌ చేయనున్నారు. అలాగే ఫుల్‌ వీడియో సాంగ్‌ను జులై 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, వ‌రీనా హుస్సేన్‌, శ్రీనివాస రెడ్డి, బ్ర‌హ్మాజీ ఇత‌ర కీ రోల్స్ చేస్తున్నారు. బింబిసార ఆగ‌స్టు 5న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హ‌రికృష్ణ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బింబిసార‌ మూవీకి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

Next Story